భారత్‌లోకి టెస్లా.. లోకేశ్‌పై సుభాష్ ఆసక్తికర ట్వీట్

by srinivas |   ( Updated:2025-02-23 14:30:34.0  )
భారత్‌లోకి టెస్లా.. లోకేశ్‌పై సుభాష్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌(India)లోకి త్వరలో టెస్లా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఉద్యోగులకు కూడా నియమించుకుంటోందంటూ పలువురు అంటున్నారు. అయితే ఎలన్ మాస్క్‌(Elon Musk)కు చెందిన ఈ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ(Tesla Motors)ను ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టెస్లా ఏర్పాటుకు ఏపీలో అనువైన పరిస్థితులు ఉన్నాయని ఆ సంస్థకు వివరించేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మంత్రి సుభాష్(Minister Subhash) చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 2019 జనవరిలో రాష్ట్రానికి చంద్రబాబు(Chandrababu) కియా(Kia) తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు టెస్లాను మంత్రి లోకేశ్(Minister Lokesh) తీసుకొస్తారని పేర్కొన్నారు. విజన్ ఉన్న నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తే అభివృద్ధి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉంటుందని చెప్పారు. కియా మనది.. టెస్లా కూడా మనదేననంటూ మంత్రి సుభాష్ ట్వీట్ చేశారు.

Advertisement
Next Story

Most Viewed