మరో వివాదం.. దువ్వాడ శ్రీనివాస్ కోసం రిటైర్డ్ టీచర్ గాలింపు

by srinivas |   ( Updated:2024-08-17 15:47:19.0  )
మరో వివాదం.. దువ్వాడ శ్రీనివాస్ కోసం రిటైర్డ్ టీచర్ గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి విషయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ నిర్మించిన ఇంటికి సంబంధించి చెల్లించాల్సిన డబ్బులు కోసం స్థలం ఓనర్ తిరుగుతున్నారు. టెక్కలిలో రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశానికి చెందిన ఇంటి స్థలాన్ని దువ్వాడ కొనుగోలు చేశారు. అయితే కొంతమొత్తం డబ్బులు చెల్లించారు. ఇంకా రూ.60 లక్షలు ఇవ్వాలని పార్వతీశం చెబుతున్నారు. ఈ డబ్బులు అడిగేందుకు శనివారం సాయంత్రం టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అక్కడ పరిస్థితిని చూసి ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. కానీ తన స్థలానికి సంబంధించి రూ. 60 లక్షలు ఇవ్వాలని, ఇవ్వనిపక్షంతో దువ్వాడ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని, ఆ మేరకే అగ్నిమెంట్ చేసుకున్నామని, అందుకు దువ్వాడకు ఒప్పుకున్నారని పార్వతీశం పేర్కొన్నారు.

Advertisement

Next Story