- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP:కూటమి గెలిస్తే వైసీపీని మూసేస్తానని ప్రకటించు..జగన్ :టీడీపీ నేత
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ ఐదేళ్ల పాలనతో ప్రజలంతా విసిగిపోయారని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి వారే తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏపీలో ఎవరు అధికారం చేబడతారో అనేది జూన్ 4వ తేదీన తేలిపోనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బొండా ఉమా వైఎస్సార్సీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. వైసీపీ ఘన విజయం సాధిస్తుందని బీరాలు పలుకుతున్న జగన్..ఒకవేళ కూటమి గెలిస్తే తన పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓడిపోతున్నామనే భయం వైసీపీ కీలక నేతలు బొత్స, పెద్దిరెడ్డి ముఖాల్లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Next Story