- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విషాదం.. ఇంట్లో అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం యాటకల్లులో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన జ్యోతి, రూపా అనే అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. గంట ముందు వరకు అందరితో కలిసి మెలిసి ఉన్న అక్కాచెల్లెళ్ళు ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన చాకలి నారాయణస్వామి, సరస్వతి కుమారులుగా గుర్తించారు. ఇద్దరు కూడా అనంతపురంలో డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల కాలంలోనే గ్రామానికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులా.. ప్రేమ వ్యవహారమా..? ఇతర సమస్యలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులా.. ప్రేమ వ్యవహారమా..? ఇతర సమస్యలా, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
Read More..