- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anantapur: వివాదంలో రచయిత అనంత Sri Ram

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ గేయ రచయిత అనంత శ్రీరామ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నిషేధించిన పదాన్ని ఉపయోగించినందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదప్రయోగం చేసి తమను కించపరిచారని ఆరోపిస్తూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిషేధిత పదప్రయోగం చేసి తమను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా అనంత శ్రీరామ్ పాలకొల్లులో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన పదాన్ని ప్రయోగించారు. ఆ పదాన్ని ప్రభుత్వం నిషేధించిందని తెలుసుకుని నాలుక్కరచుకున్నారు. దీనిపై బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ అనంత శ్రీరామ్‌పై ఆ సామాజిక వర్గం నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
దేవబ్రహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అంటూ అగ్రనటుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇటీవలే వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఆ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాలయ్య దిగి వచ్చారు. పొరపాటును మన్నించాలని కోరడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. మరి అనంత శ్రీరామ్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ వ్యవహారం ఇంకెన్నిమలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి : 'Mawa Bro' అంటూనే ధమ్కీ ఇస్తున్నVishwak Sen