చందు మనిషా? పశువా?..!

by srinivas |   ( Updated:2022-11-26 15:16:44.0  )
చందు మనిషా? పశువా?..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ జగన్‌కి ఏమాత్రం నైతికత ఉన్నా, అశ్లీల అసభ్యపదజాలంతో, పశువుకంటే హీనంగా చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను దూషించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందుపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి తక్షణమే పార్టీ నుంచి తప్పించాలని కోరారు. తోపుదుర్తి చందుపై తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టింది రాష్ట్ర వినాశనానికేనని, ఆయన వైఖరిని, ఆ పార్టీ వారిని చూస్తే అర్థమవుతోందన్నారు. అశ్లీలత, అసభ్యతల కలబోతతో వైసీపీ నేతలు బూతులపురాణం వల్లేవేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. జగన్ అసమర్థుడు, చేతగానివాడు కాబట్టే టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుతో దూషణల పర్వానికి దిగారని ఆరోపించారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ జగన్‌కు లేకపోవడం వల్లే, వైసీపీ నేతలు బరితెగించి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.

రాప్తాడు వైసీపీఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు పశువుకంటే హీనంగా మాట్లాడాడు అని వర్ల రామయ్య మండిపడ్డారు. అసలు అతను మనిషా..లేక పశువా? పశువులు కూడా సిగ్గుపడేలా ఆ భాష ఉందన్నారు. చందును పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. చందు అసభ్యభాషను వైఎస్ జగన్ సమర్థిస్తున్నాడా అని ప్రశ్నించారు. లోకేశ్ మా టార్గెట్ అంటున్నారంటే, వారి ఉద్దేశం లోకేశ్‌ను చంపేస్తామనా? అని ప్రశ్నించారు. లోకేశ్ మీతాటాకుచప్పుళ్లకు, ఉడతఊపులకు భయపడే స్థితిలో లేడు, ఆకుర్రాడు చాలా రాటుదేలిపోయాడని తెలుసుకోండి అని సూచించారు. తోపుదుర్తి సోదరుడి వ్యాఖ్యలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకని సుమోటోగా కేసు నమోదు చేయలేదు అని నిలదీశారు. ఎంపీని కూడా కాళ్లువిరగ్గొట్టే పోలీస్ శాఖ, ఎమ్మెల్యే సోదరుడిని ఎందుకు ఉపేక్షిస్తోంది? డీజీపీ తక్షణమే ప్రకాశ్ రెడ్డి సోదరుడిపై కేసుపెట్టి, వెంటనే అరెస్ట్ చేసి, బహిరంగ ప్రకటన చేయాలి అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

READ MORE

Mla Anil Kumar: తప్పు ఎలా అవుతుంది?.. నెల్లూరు ఘటనపై కౌంటర్

Advertisement

Next Story