AP: నన్ను చంపాలని చూస్తున్నారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేతిరెడ్డి సంచలన ఆరోపణలు

by Mahesh |   ( Updated:2024-08-21 05:41:17.0  )
AP: నన్ను చంపాలని చూస్తున్నారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేతిరెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం.. తాడిపత్రి వివాదం సంచలనంగా మారింది. మంగళవారం, టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కారణంగా దాడులకు ప్రతి దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పక్కా పథకం ప్రకారమే.. తనను చంపేందుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని.. తాను తాడిపత్రికి రాకూడదని దౌర్జన్యం చేస్తున్నారని, జిల్లాల్లో ఆయనకు రాజకీయంగా అడ్డొస్తాననే భయంతోనే ఈ దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. తమ అన్నను కూడా గతంలో ఇలాగే హత్య చేశారని.. తనను తాడిపత్రి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని, తన ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటానని కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed