- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో జిల్లా ఎన్నికల అధికారి
దిశ ప్రతినిధి, అనంతపురం:నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఈవీఎం గోడౌన్లో సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి వచ్చిన 94 ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పరిశీలించారు.ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బెల్ కంపెనీ నుంచి వచ్చిన ఇద్దరు ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం సజావుగా ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఈవీఎం లను భద్రపరిచిన గోడౌన్లను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, డీపీఓ ప్రభాకర్ రావు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.