- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kalyanadurgam: టీడీపీ బస్సు యాత్రలో టెన్షన్.. టెన్షన్
దిశ, కళ్యాణదుర్గం: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం శీగలపల్లి నుంచి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో బస్సు యాత్ర సాగింది. అయితే అప్పలపల్లి గ్రామంలో ఉన్నం, ఉమా వర్గీయులు బాహాబాహికి దిగారు. దీంతో జిల్లా నాయకులు వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వారి మాటలను లెక్కచేయకుండా కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. కుందుర్పిలో ర్యాలీగా వెళ్లిన బస్సు యాత్రలో ఉన్నం వర్గం లోకల్ నాయకుల వర్ధిల్లాలి.. వలస పక్షి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు
అయితే కుందుర్పి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో అనంతపురం జిల్లా నాయకులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, కళ్యాణ దుర్గం టిడిపి ఇన్చార్జ్ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.
అయితే ఈ సభకు ఒక వర్గం హాజరుకాకుండా మరొకచోట సభను ఏర్పాటు చేయడం గమనార్హం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగిన బస్సు యాత్ర గందరగోళంగా సాగడంతో జిల్లా పార్టీ పెద్దలు తలలు పట్టుకున్నారు. ఈ బస్సు యాత్ర సాక్షిగా పార్టీలో మరొకసారి వర్గ విభేదాలు బయటపడటంతో పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.