‘అనంత’ మార్కెట్ యార్డు అభివృద్ధికి చర్యలు : CEO

by Bhoopathi Nagaiah |
‘అనంత’ మార్కెట్ యార్డు అభివృద్ధికి చర్యలు : CEO
X

దిశ ప్రతినిధి, అనంతపురం : అనంతపురం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడతామని రాష్ట్ర అగ్రి మార్కెటింగ్ డైరెక్టర్, రైతు బజార్ సీఈఓ ఎం.విజయసునీత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ వద్ద ఉన్న మార్కెట్ యార్డును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తదితరులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండ్ల మార్కెట్‌లో యాక్షన్ నిర్వహించేందుకు అసంపూర్తిగా ఉన్న షెడ్‌ని వెంటనే పూర్తి చేయాలన్నారు. మార్కెట్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని, వాటిని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మార్కెటింగ్ అధికారులు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడి సమస్యలను వారు వివరించారు. మార్కెట్ లో డ్రైనేజీ సిస్టం, డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేయాలని, ఇంతకుముందు మార్కెట్ యార్డులో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు 4-5 కోట్ల రూపాయల వరకు పాతవి, కొత్తవి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, వాటిని మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, రీజనల్ జేడీ రామాంజనేయులు, ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed