- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తలకి అలెర్ట్.. సంక్రాంతికి కొత్త కోడలికి తులం బంగారం పెట్టకుంటే..
దిశ వెబ్ డెస్క్: ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను మాత్రమే తెస్తోంది. కానీ ఈ ఏడాది కొత్త కోడళ్ళకి శుభవార్తను కూడా తెచ్చింది. అదే కొత్త కోడళ్ళకి ఆమె అత్తగారు తులం బంగారం చేయించాలి. లేకపోతే కీడు వాటిల్లుతుంది . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకేముంది బంగారం ప్రియులైన మహిళలు వచ్చిందే అవకాశం అనుకుంటూ సంతోష పడుతున్నారు. అత్తలు కూడా చేసేదేమీ లేక ఇష్టంగానో అయిష్టంగానో కొత్త కోడలికి బంగారం బహుమతిగా ఇస్తున్నారు. మరి మీరు మీ కోడలికి బంగారం కొంటున్నారా..? కొడుకు భార్యకు వృద్దాప్యంలో మిమ్మల్ని చూసుకునే మీ కోడలికి బంగారం కొనడంలో తప్పులేదు.
కానీ సంక్రాంతికి ఇవ్వకుంటే కీడు జరుగుతుంది.. ఇస్తే మేలు జరుగుతుంది అనే మూఢ నమ్మకాలు పెట్టుకుని ఇలాంటి పుకార్లను ప్రచారం చెయ్యకండి. కూటి కోసం కోటి విద్యలు అన్నది పాత మాట.. వ్యాపారం జోరుగా సాగాలంటే వేల పుకార్లు సృష్టించాలన్నది నేటి మాట. కనుక ఇలాంటి పుకార్లను నమ్మి మోస పోకండి. తాహత ఉంటె పర్లేదు.. కానీ ఈ పుకార్లను నమ్మి ఎక్కడ కీడు జరుగుతుందో అనే భయంతో అప్పులు చేసి బంగారం కొని కోడలికి బహుమతిగా ఇచ్చి కష్టాలను కొని తెచుకోకండి. ఆర్భాటాలకు పోయి అప్పులు పాలు అవ్వమని ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదు. మన పూర్వికులు ఏం చెప్పిన దాని వెనుక మానవాళికి మంచి చేసే ఉద్దేశమే ఉంది. కానీ మనమే మన పూర్వికులు చెప్పింది అర్ధం చేసుకోలేక నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా తెలియని స్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటి మూఢ నమ్మకాలను వదిలి పెట్టండి. అందరికి దిశ సంక్రాంతి శుభాకాంక్షలు.