దక్షిణ కోస్తాలో వైసీపీకి వీస్తున్న ఎదురుగాలి.. పట్టుకోల్పోనుందా..?

by Indraja |   ( Updated:2024-01-07 09:36:52.0  )
దక్షిణ కోస్తాలో వైసీపీకి వీస్తున్న ఎదురుగాలి.. పట్టుకోల్పోనుందా..?
X

దిశ వెబ్ డెస్క్: అధికార పార్టీకి ఆయువు పట్టు దక్షిణ కోస్తా.. గత ఎన్నికల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో వైసీపీ విజయభేరిని మోగించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ లో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో చాలామంది వైసీపీ నేతలు జగన్ వైకిరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైకిల్‌ ఎక్కేందుకు సై అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో మంతనాలు జరువుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్న అధికార పార్టీ నేతలను టీడీపీ అధిష్టానం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ MLAశుక్రవారం జగన్‌ను కలిశారు.. ఈ నేపథ్యంలో ఆయన్ను ఒంగోలుకు మారాల్సిందిగా సూచించారు. అయితే తన సిటింగ్‌ స్థానాన్నే కేటాయించాలని ఆయన పట్టుబట్టారు. లేని పక్షంలో ఒంగోలు లోక్‌సభ సీటు ఇవ్వాలని కోరారు. దీనికి హామీ లభించకపోవడంతో..ఆయన కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. దీనితో దక్షిణ కోస్తా జిల్లాలో వైసిపికి ఎదురుగాలి వీస్తున్నట్లు సమాచారం. ఈ ఎదురుగాలి ఈదురుగాలిగా మారిందంటే వైసీపీ కనుమరుగవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా జగన్ అగ్రనాయకత్వ తీరును మార్చుకోకపోతే మొదటికే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed