New Year Effect: దయచేసి మహిళలు అక్కడికి వెళ్లకండి.. సినీనటి మాధవీలత సంచలన పిలుపు

by Gantepaka Srikanth |
New Year Effect: దయచేసి మహిళలు అక్కడికి వెళ్లకండి.. సినీనటి మాధవీలత సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురంలోని తాడిపత్రి(Tadipatri)లో ఏర్పాటు చేసిన న్యూఇయర్ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. మహిళల కోసమే ప్రత్యేకంగా వేడుకలు ఏర్పాటు చేశామని.. కేవలం మహిళలు మాత్రమే రావాలని నిర్వహకులు ఆదేశాలు జారీ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా.. ఈ వేడుకలపై సినీ నటి మాధవీలత(Actress Maadhavi Latha) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. తాడిపత్రిలోని జేసీ పార్కులో ఏర్పాటు చేసిన న్యూఇయర్ వేడుకలకు మహిళలు ఎవరూ వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. పెన్నానది వద్ద గంజాయి సేవించిన ఆకతాయిలు ఉంటారని.. దయచేసి మహిళలు జాగ్రత్తంగా సురక్షితమైన ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవాలని కోరారు.

అంతేకాదు.. ఈ వేడుకులను బహిష్కరించాలని బీజేపీ మహిళా నాయకురాలు సాధినేని యామిని(Yamini Sadineni) మహిళలకు సూచించారు. ప్రజాప్రతినిధులే మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. మరోవైపు నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు విభిన్న రూపాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈసారి న్యూఇయర్ పార్టీని విభిన్నంగా నిర్వహిస్తున్నారు. కేవలం మహిళలకు మాత్రమే ఈ పార్టీలో అనుమతించేలా దీన్ని ప్లాన్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed