- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చెన్నాయుడు! అబద్దాలు కట్టిపెట్టు: ధర్మాన కృష్ణదాస్
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలాడటంలో అచ్చెన్నాయుడుకు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. ఇకనైనా అబద్దాలు కట్టిపెడితే మంచిదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా పొలాకిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ...వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు ఖాయం అంటూ అచ్చెన్న పెద్ద ఆశతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అవి గాలిలో మేడలని తేటతెల్లం అవుతుందని చెప్పుకొచ్చారు. అవినీతి కి పితామహుడు జగనే అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న అచ్చెన్నాయుడు.. చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చడానికే తమ నేతలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రూ.45 వేల కోట్లు దోచేసిన వ్యక్తి జగన్ అంటూ ఎల్లోమీడియా ప్రచారాన్నే చిలక పలుకులుగా చెబుతూ మాయ చేయాలని చూస్తున్న అచ్చెన్న తీరు అందరికీ అర్ధమౌతోందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.
చంద్రబాబు జైల్లో ఉంటే మాకు సంబంధమేంటి?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా జైలు గోడల మధ్యన ఉంటే దానికి, ప్రభుత్వానికి సంబంధమేంటని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నిలదీశారు. చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని.. ఈ కేసులో అంతకుముందే ఈడీ, జీఎస్టీ, ఆదాయపన్ను శాఖ విచారణ చేపట్టి అవినీతి జరిగిందని తేల్చిన తర్వాతే సీఐడీ విచారణ చేపట్టిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించిందని పేర్కొన్నారు. ఏ తప్పు చేయక పోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని చెబుతున్న అచ్చెన్నకు బాబు కేసులు ఏసీబీ కోర్టుల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్నాయని..అక్కడ విచారణ సాగుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అవినీతికి పాల్పడకుంటే జైలులో ఎందుకు ఉంచుతారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటో టీడీపీ నేతలు తెలుసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూచించారు.