- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడాకుసుమాలు జ్యోతి సురేఖ, కోనేరు హంపిలకు ఘన స్వాగతం
దిశ, డైనమిక్ బ్యూరో : ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన జ్యోతిసురేఖ,కోనేరు హంపిలు స్వదేశానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జ్యోతి సురేఖ, కోనేరు హంపిలకు అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ బుధవారం సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వెన్నం జ్యోతి సురేఖ మాట్లాడుతూ... చైనాలో హాంగ్జవ్‌లో జరిగిన 19 వ ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ (విలువిద్య) పోటీలలో వరుసగా మూడు గోల్డ్ మెడలో సాధించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి 7 వరకూ పోటీలు జరిగాయని...మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్‌లో ఒకేసారి మూడు మెడల్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని వెల్లడించారు. ఒలంపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని వ్యాఖ్యానించారు. భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మరోవైపు ఏషియన్ గేమ్స్‌లో ఉమెన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని కోనేరు హంపి అన్నారు. మెన్, ఉమెన్ సెక్షన్ లో కూడా టీం మెడల్స్ వచ్చాయని పేర్కొంది. ఏషియన్ గేమ్స్‌లో భాగంగా అన్ని క్రీడా విభాగాలు కలిసి ఒకేసారి జరిగాయన్నారు. మెన్, ఉమెన్ కేటగిరీలో ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్స్ రావడం ఇదే మొదటిసారి అని కోనేరు హంపి వెల్లడించింది. ఆసియా క్రీడల్లో చెస్ పోటీలు రెగ్యులర్‌గా జరిగేవి కావని.. 2006, 2010 తర్వాత మళ్లీ ఈ ఏడాదే జరిగాయని కోనేరు హంపి తెలిపారు.