ఆ నియోజకవర్గంలో వైసీపీకి షాక్.. 220 మంది టీడీపీలో చేరిక

by Disha Web Desk 18 |
ఆ నియోజకవర్గంలో వైసీపీకి షాక్.. 220 మంది టీడీపీలో చేరిక
X

దిశ ప్రతినిధి,మంగళగిరి: నియోజకవర్గాన్ని నెం.1 గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ సమక్షంలో బుధవారం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 220 మంది టీడీపీలో చేరారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుగ్గిరాల మాజీ ఏఎంసీ చైర్మన్ కొండూరి ముత్తయ్య, ఆయన సతీమణి, శృంగారపురం సర్పంచ్ కొండూరు సంధ్యారాణి ఆధ్వర్యంలో 50 మంది, మంగళగిరి 27వ వార్డు కు చెందిన ఎస్ కె నాగూర్ వలి, ఎస్ కె హకీం ఆధ్వర్యంలో 50 మంది మైనార్టీ సోదరులు, మాదిగాని గురునాథం ఆధ్వర్యంలో 100 మంది నేతలు, మంచికలపూడి నుంచి అద్దేపల్లి జయరాజు, పెరవలి గాంధీ, యార్లగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 20 మంది టీడీపీలో చేరారు.

మంగళగిరి నియోజకవర్గ దళిత నేతల్లో కొండూరి ముత్తయ్య కీలక నేతగా ఉన్నారు. ముత్తయ్య రాకతో దుగ్గిరాల మండలం లో టీడీపీకి అదనపు బలం చేకూరింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు శవరాజకీయలే తెలుసు. కోడి కత్తి ఘటన తర్వాత సొంత బాబాయిని చంపి సానుభూతి పొందారు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. ఈ సాకుతో ఎవరిని బలి ఇస్తారోనని అందరూ భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. జగన్ మాదిరిగా మాకు నీచ రాజకీయాలు చేయడం మాకు చేతకాదని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు కేశంనేని శ్రీ అనిత దామర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.


Read More..

నందమూరి బాలకృష్ణపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు

Next Story