టీడీపీ నేత కారు దగ్ధం కేసులో కొత్త ట్విస్ట్.. ఆయనపై రౌడీ షీట్ ఓపెన్..?

by Indraja |
టీడీపీ నేత కారు దగ్ధం కేసులో కొత్త ట్విస్ట్.. ఆయనపై రౌడీ షీట్ ఓపెన్..?
X

దిశ ప్రకాశం:ఇంటి ప్రాంగణం లో పార్కింగ్ చేసిఉన్న కారు దగ్ధం కేసులో కీలక సూత్రధారి కనసాని ఈశ్వర రెడ్డి అని ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ నేపథ్యంలో కనసాని ఈశ్వర రెడ్డి నేర చరిత్ర,నేర స్వభావాన్ని పరిగణన లోకి తీసుకుని సింగరాయకొండ పోలీస్‌లు అతని పై రౌడి షీట్ ( చెడు నడత గల వారి జాబితా లో )తెరిచేందుకు ఉన్నత అధికారులకు సిఫారసు చేశారు.

నేర స్వభావంతో ప్రజలపై దౌర్జన్యం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మనస్తత్వంతో వ్యవహరించడం, బల ప్రయోగంతో ప్రజల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి కార్యకలాపాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారికి భయం ఉండే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా పోలీసులు ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు.

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఈశ్వర రెడ్డి పై ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. అయితే తనకు ఉన్న రాజకీయ, ఆర్థిక బలంతో తన నేరాలను బయటకు రానివ్వలేదని సమాచారం. కాగా తన నేర స్వభావాన్నిచివరికి అమాయకులపై రుద్దాడని, సుపారి ఆశ చూపి కారు దగ్ధం నేరానికి పాల్పడడం పోలీస్ అధికారులలో ప్రధాన చర్చ అయినట్లు తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి నేరాలు చోటు చేసుకోవడం మంచిది కాదని, ఇలాంటి నేర స్వభావాన్ని అదుపు చెయ్యడానికి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారుల సూచన మేరకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వర రెడ్డిపై నమోదయిన కేసులను పరిశీలించి నేర స్వభావాన్ని ఆధారం చేసుకుని రౌడీ షీట్ తెరిచేందుకు ఉన్నత అధికారులకు తగిన ప్రతి పాదనలను పంపినట్లు తెలుస్తోంది.

కారు దగ్ధం కేసులో ఉపాధి కోసం తన వద్ద పని చేస్తున్న వారికి డబ్బు ఆశ చూపి (ఒకడిని బాల నేరస్తుడిగా ) వారిని నేరానికి ప్రోద్బలించిన సంఘటనని పరిగణనలోకి తీసుకుని ఇలాంటి చర్యలకు మరొకరు గురి కాకుండా పోలీస్ పరంగా తీసుకునే చర్యలలో భాగంగా ఈశ్వర రెడ్డి పై రౌడి షీట్ తెరిచేందుకు సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. ఎవరైనా ఇలా చిల్లర నేరాలకు పాల్పడినా వారికి భయం ఉండే విధంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో రౌడీ షీట్ తెరిచేందుకు ఉన్నత అధికారులకు ప్రతి పాదనలు పంపినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story