- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రియురాలితో భార్యకు చిక్కాడు... ఆ తర్వాత..

దిశ, డైనమిక్ బ్యూరో, పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా సత్తెనపల్లి బోయకాలనీలో ఓ భర్త వివాహేతర సంబంధాన్ని భార్య గుట్టురట్టు చేసింది. ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆమె బంధువులతో కలిసి ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన ఆకుల వాసుకు అదే గ్రామానికి నవ్యశ్రీ తో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఓ బాబు పుట్టాక వాసు భార్యకు దూరంగా ఉంటున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పులను గమనించిన నవ్యశ్రీ ఆరా తీయగా, మరో అమ్మాయి సంబంధం ఉన్నట్లుగా గుర్తించింది. ఈ విషయంపై భర్తను నిలదీయడంతో వారి మధ్య తరచూ వివాదాలు నెలకొన్నాయి. అప్పటి నుంచి వాసు భార్య నవ్యశ్రీ ను విడిచి పెట్టి తప్పించుకు తిరుగుతున్నాడు. ఓ అమ్మాయితో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి బోయకాలనీ లో ఆమెతో కలిసి వాసు ఉన్నట్లుగా తెలుసుకున్ననవ్యశ్రీ బంధువులతో కలిసి ఆ ఇంటి పై దాడి చేసింది. ప్రియురాలితో కలసి ఉన్న వాసుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.