Ap: రోడ్డుపైకి వచ్చిన చిరుత.. ఇంతలో షాకింగ్ ఇన్సిడెంట్

by srinivas |   ( Updated:2025-01-27 04:53:05.0  )
Ap: రోడ్డుపైకి వచ్చిన చిరుత.. ఇంతలో షాకింగ్ ఇన్సిడెంట్
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డుపైకి వచ్చిన చిరుతపులి(Leopard) ఊహించని ప్రమాదంతో మృతి చెందింది. అటవీ ప్రాంతంలో హాయిగా సంచరించే చిరుత పులి ఆహారం కోసం వెతుకుతూ రోడ్డుపైకి వెళ్లింది. ఇంతలో చిరుతను మృత్యువు వెంటాడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా సింగనపల్లి అటవీ ప్రాంతం(Singanapally forest area)లో జరిగింది. సింగనపల్లి అటవీ ప్రాంతంలో సంచరించే చిరుత విజయవాడ జాతీయ రహదారి(Vijayawada National Highway)పైకి వెళ్లింది. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత తీవ్రంగా గాయపడింది.

అయితే చిరుతను చూసిన స్థానికులు భయంతో దాని వైపు వెళ్లలేదు. గంటపాటు ప్రాణాలతో కొట్టుకుంది. చివరకు మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచనామా అనంతరం అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. అయితే చివరిక్షణాల్లో కొట్టుమిట్టాడుతున్న చిరుతను చూసి కొందరు మనసు కలచివేసింది. క్రూర మృగం కావడంతో చిరుతను ఆస్పత్రికి తరలించలేకపోయమని స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.

Next Story

Most Viewed