Breaking: ఏపీ డీజీపీ ఆదేశాలు.. 28 మంది డీఎస్పీల బదిలీ

by srinivas |   ( Updated:2024-08-08 04:49:54.0  )
Breaking: ఏపీ డీజీపీ ఆదేశాలు.. 28 మంది డీఎస్పీల బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఏపీ డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో 28 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే 96 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా పలువురిని బదిలీ చేసింది. పారదర్శకంగా సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు చేపట్టింది.

కాగా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేసినట్లు అభియోగాలున్న డీఎస్పీలను ఇప్పటికే బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కొందరు పోలీస్ ఉన్నతాధికారులు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఇబ్బందులకు గురి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తాము అధికారంలోకి వస్తే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపడతామని చంద్రబాబు, లోకేశ్, పవన్ హెచ్చరించారు. ఇందులో భాగంగా ఆయా శాఖల్లో బదిలీలు చేపడుతూ వస్తున్నారు. ఈ నెల 1వ తేదీనే 96 మంది డీఎస్పీలను బదిలీలో చేశారు. ఇప్పుడు మరో 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story