- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. ఆ పోస్టులు రద్దు

X
దిశ, ఏపీ బ్యూరో అమరావతి: ఏపీ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టులు రద్దు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం సంచల నిర్ణయం తీసుకుంది. AICC వెబ్ సైట్ నుంచి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్లను తొలగించింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా ఉన్న సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతం, మస్తాన్ వలీ పేర్లు తొలగించింది.
ఇటీవల అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం కొనసాగుతూ వచ్చారు. షర్మిల నిర్ణయాన్ని హేళన చేస్తున్నట్లుగా ఇటీవల సుంకర పద్మశ్రీ ఎక్స్ వేదికగా వర్కింగ్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు ఏఐసిసి లేఖ రాయడాన్ని ప్రస్తావించారు. ఇది జరిగిన మూడు రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరినీ తొలగిస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read More..
Next Story