Crime News : కాకినాడ బీచ్‌లో ఓ జంట ఆత్మహత్యాయత్నం కలకలం

by Seetharam |   ( Updated:2023-08-10 10:15:50.0  )
Crime News : కాకినాడ బీచ్‌లో ఓ జంట ఆత్మహత్యాయత్నం కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ బీచ్ వద్ద ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరుకు చెందిన అరుణ్, శ్రీదేవిలు గురువారం ఉదయం కాకినాడ బీచ్‌కు వచ్చారు. కాసేపు కలియతిరిగారు. అనంతరం ఒకచోట కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. ఒకానొక సందర్భంలో ఇద్దరూ ఏడ్చారు కూడా. అనంతరం ఇద్దరూ కలిసి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన సందర్శకులు పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో శ్రీదేవికి ఇదివరకే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. అరుణ్‌కు పెళ్లి కాలేదని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఎందుకు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఏమైనా వీరి ఆత్మహత్యకు కారణమా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story