- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన బోట్లు... ఘటనపై కేసు నమోదు
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) భారీగా వరద ప్రవాహం (Flood Flowting) వచ్చింది. అయితే ఈ ప్రవాహంలో నాలుగు బోట్లు (Boats) కొట్టుకువచ్చాయి. అంతేకాదు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీ 67, 68 గేట్లు దెబ్బతిన్నాయి. అయితే బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకేసారి నాలుగు పడవలు కొట్టుకురావడంపై కుట్ర ఉందనే కోణంలో చర్చ సాగుతోంది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇరిగేషన్ శాఖను (Irrigation Department) ఆదేశించింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై బెజవాడ వన్‌టౌన్ పోలీసులకు (Bejawada One Town Police) ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు (EE Krishna Rao) ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసుతో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
కాగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షంతో కృష్ణానదితో పాటు విజయవాడ వద్ద బుడమేరు వాగుకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో బుడమేరు వాగు గండ్లు తెగి విజయవాడ అజిత్ సింగ్ నగర్‌తో పాటు, మొగల్రాజుపురం, భవానీపురం, చిట్టీనగర్, ప్రకాశ్‌నగర్, మరికొన్ని కాలనీల్లో వరద నీరు భారీగా చేరుకుంది. ఇళ్లు, రోడ్లపై 4 నుంచి 5 అడుగుల మేర వాగు నీరు చేరింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎటు చూసినా నీటితో జనం అల్లాడిపోయారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహారం, నీళ్లు లేక అలమటించిపోయారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయ చర్యలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో సహా మంత్రులంతా వరదబాధితులకు అండగా నిలిచారు.
అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజీలోకి నాలుగు బోట్లు కొట్టుకురావడంపై పలు అనుమానాలు తలెత్తాయి. ‘ఆ బోట్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి. బోట్లు కొట్టుకువస్తుంటే ఓనర్లు ఏం చేస్తున్నారు. దీనివెనుక దురుద్దేశం ఉందా..’ అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ రంగంలోకి దిగింది. నిజాలు వెలికితీయాలని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.