ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్‌..వైసీపీలో చేరిన సీనియర్‌ నేత?

by Jakkula Mamatha |   ( Updated:2024-03-26 14:08:28.0  )
ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్‌..వైసీపీలో చేరిన సీనియర్‌ నేత?
X

దిశ,ఏలూరు:ఎన్నికల వేళ దెందులూరు నియోజకవర్గ టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. నియోజకవర్గం లో సీనియర్‌ నాయకుడు పాలడుగు భానుప్రకాష్‌ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దెందులూరు అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్‌ వైఖరితో విసుగుచెంది టీడీపీకి రాజీనామా చేసినట్లు పాలడుగు చెప్పారు.గత దశాబ్ద కాలంగా పెదవేగి మండలం లో జగన్నాధపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాలడుగు భాను ప్రకాష్ కొనసాగుతున్నారు.టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన మంగళవారం దెందులూఎన్నికల వేళ దెందులూరు నియోజకవర్గ టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. నియోజకవర్గం లో సీనియర్‌ నాయకుడు పాలడుగు భానుప్రకాష్‌ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైసీపీలో చేరారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పాలడుగు భాను ప్రకాష్ గారు,టీడీపీ నాయకులు కమ్మ రాజారావు , కండేపు బాబురావు , పిట్టా రవి కూడా వైసీపీలో చేరారు.వారిని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Next Story