- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను అవకాశంగా మార్చుకుందాం : ఆనంద్ మహీంద్రా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తెస్తున్న తంటా అంతాఇంతా కాదు. వంద దేశాలకు పైగా పాకిన ఈ మహమ్మారి ఇండియాలోనూ చొరబడింది. కరోనా వ్యాప్తితో ప్రపంచ మార్కెట్లు సహా దేశీయ మార్కెట్లు భారీ పతనాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు భారీగా తగ్గాయి. కరోనా వల్ల మార్కెట్లకు ఏర్పడిన సంక్షోభాన్ని ఇండియా అనుకూలంగా మార్చుకోవాలంటూ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. అదెలాగో కూడా ఆయనే వివరించారు. ట్విటర్ వేదికగా దేశీయ మార్కెట్ల భారీ పతనానికి ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘ఈరోజు మార్కెట్ల పతనాన్ని చూస్తుంటే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంలా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలని’ తెలిపారు.
దీనికోసం మూడు ప్రధాన సూచనలు ఇచ్చారు..అవి, 1. వినిమయం పెంచడమే కాకుండా ద్రవ్యలోటును అధిగమించేందుకూ, తద్వారా లాభాలను పెంచేందుకూ చమురు ధరల పతనాన్ని ప్రభుత్వం అనుకూలంగా ఉపయోగించుకోవాలి. 2. స్వచ్ఛత, పరిశుభ్రతను పెంచి పర్యాటకులను ఆకట్టుకోవాలి. అలా చేస్తే విదేశీయులు చైనాకు వెల్లకుండా ఇండియా పర్యటనకు వస్తారు. 3. అంతర్జాతీయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనల సడలింపు ఇవ్వాలి. ఇటువంటి నిర్ణయాలతో ఎక్కువగా ఇండియాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
So this is what a global meltdown feels like. For India, it’s a crisis we mustn’t waste. Three opportunities we need to leverage: A) The Govt can use low oil prices both to spur consumption but also retain some of the windfall gains to tackle the deficit. (1/2) https://t.co/uIzM95F2Y2
— anand mahindra (@anandmahindra) March 9, 2020
Tags: Mahindra, Anand Mahindra, Dalal Street, Coronavirus, Covid19,China