- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ ఆటో అద్భుతం: ఆనంద్ మహీంద్ర
దిశ, వెబ్ డెస్క్: మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్రా..ఎప్పటికప్పుడు తనకు నచ్చిన వీడియోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. సామాజిక విషయాలపై తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. కొవిడ్ నేపథ్యంలో తనవంతుగా ఎంతో సాయం కూడా చేశాడు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ శానిటైజేషన్, మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం చాలా ప్రధానమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్ కట్టడికి క్యాబ్ డ్రైవర్లు తమ క్యాబుల్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, పబ్లిక్ వెహికల్స్‌లో సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కస్టమర్లు అందులో ఎక్కడానికి ఇష్టపడటం లేదు. ఎక్కడ కొవిడ్ బారిన పడతామోనని జంకుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను కొవిడ్ జాగ్రత్తలకు అనుగుణంగా తీర్చిదిద్దాడు.
One silver lining of Covid 19 is that it’s dramatically accelerating the creation of a Swachh Bharat…!! pic.twitter.com/mwwmpCr5da
— anand mahindra (@anandmahindra) July 10, 2020
ఈ ఆటోకు సంబంధించిన ఓ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అయ్యింది. ఆటో పైన కొవిడ్-19 హెల్ప్‌లైన్ నెంబర్స్‌తో పాటు, కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రాసి పెట్టాడు. మరోవైపు కొవిడ్ వేళ ఫ్రంట్ వారియర్స్‌గా ముందుండి పోరాడిన వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలంటూ రాశారు. అంతేకాదు తన కస్టమర్లకు ఫ్రీ వైఫై కూడా అందిస్తున్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు హ్యాండ్‌వాష్ చేసుకునేలా ఆటోలోనే సింక్ ఏర్పాటు చేశాడు. దాని చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలు ఏర్పాటు చేశాడు. అంతేకాదు స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్‌లకు రెండు చిన్నపాటి చెత్త కుండీలను కూడా ఆటోలోనే ఏర్పాటు చేశాడు. ఈ ఆటోకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ డ్రైవర్‌ను మెచ్చుకున్నాడు. అయితే, ఈ ఆటో ఎక్కడిది, ఆ డ్రైవర్ పేరేంటి తదితర విషయాలు మాత్రం పూర్తిగా తెలియదు.