ఆనంద్ మహీంద్రా ‘మండే మోటివేషన్’

by Shyam |
ఆనంద్ మహీంద్రా ‘మండే మోటివేషన్’
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఐటీ ఉద్యోగులకు వారంలో ఐదు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే వీకెండ్‌ వస్తే ఫుల్ ఎంజాయ్ చేసే టెకీలు.. ‘మండే’ వస్తుందంటే మాత్రం కాస్త ఆందోళనకు గురవుతారు. ‘అబ్బో అప్పుడే మండే వచ్చేసిందా? మళ్లీ వర్క్ చేయాలా, వీకెండ్ రావాలంటే ఇంకా ఐదు రోజులున్నాయా’ ఇలా ఆలోచనల్లోకి వెళతారు. రెండు రోజుల ఎంజాయ్‌మెంట్ తర్వాత మళ్లీ వర్క్ మోడ్‌లోకి వెంటనే లాగిన్ కావాలంటే, మన మనసు ఒప్పుకోదు. జాయ్‌ఫుల్ హ్యాంగ‌వుట్ నుంచి బయటపడటం అంత సులభమేం కాదు. ఐటీ ఉద్యోగులనే కాదు, చాలామంది ఓ సెలవు రోజు తర్వాత అదే ఫీలింగ్‌లో ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో ఓ పరిష్కారం చూపారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఆయన మండే మోటివేషన్ హ్యాష్‌ట్యాగ్‌తో.. మండే ఒత్తిడి నుంచి బయటపడేందుక మంచి సలహా ఇచ్చాడు. ‘ఎప్పుడూ మీ గతానికి ఖైదీ కాకూడదు. గతం అనేది ఓ పాఠం మాత్రమే. లైఫ్ సెంటెన్స్ కాదు. నేను మండే ఆందోళన నుంచి బయటపడేందుకు ఈ రోజు నుంచి నేను చేయగలిగే భిన్నమైన అంశాలపై దృష్టి పెడతాను’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.

నిజమే మరి.. గతాన్ని గతంలోనే వదిలేస్తే, ప్రజెంట్ అనుభవించవచ్చు. లేదంటే చేతిలో ఉన్న ప్రస్తుత కాలాన్ని, ఫ్యూచర్‌ను కూడా కోల్పోతాం. అందుకే ‘నిన్న అనేది క్యాన్సిల్ అయిన చెక్, రేపు అనేది ఓ ప్రామిసరీ నోట్, దాని గురించి లెక్కించకు, ఈ రోజు మాత్రం నీ చేతిలో ఉన్న క్యాష్. దాన్ని వీలైనట్లుగా ఉపయోగించు’ అని అంటుంటారు.

Advertisement

Next Story

Most Viewed