ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి

by srinivas |
road accident
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలో ఆర్టీసి బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెదింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో ఉండడమే ఈ ఘటనకు కారణం అని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు డ్రైవర్ పై కేసునమోదు చేశారు.

Advertisement

Next Story