- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షాకింగ్ : యువతులతో అధికారి రాసలీలలు.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని..
దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయక యువతులను మభ్యపెట్టేవాడు. తర్వాత వారిని శారీరకంగా వాడుకునేవాడు. మోజు తీరాక ఉద్యోగం ఊసెత్తితే కస్సుబుస్సులాడేవాడు. అంతేకాదు ఆఫీసు దరిదాపుల్లో కూడా బాధితులను రానిచ్చేవాడు కాదు. దీంతో మోసపోయిన బాధితులు సోషల్ మీడియాలో తమ గోడు వెల్లబోసుకోవడంతో ఆ అధికారి రాసలీలల గుట్టు రట్టైంది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీఏ పీవో ఆర్‌వీ సూర్యనారాయణ తనకు ఐటీడీఏలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కోరిక తీర్చుకుని మోసం చేశాడని తనతోపాటు మరెంతోమందిని ఇలాగే వాడుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆరోపణలు చేసింది.
Read More: ఎస్ఐ రాసలీలలు.. తుపాకీ గురిపెట్టి మరీ బాలికపై అఘాయిత్యం
ఈ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పీవో సూర్యనారాయణను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అలాగే మెజిస్టీరియల్ విచారణ బాధ్యతలను ఏలూరు ఆర్డీవో పి.రచనకు అప్పగించారు. పోలవరం డీఎస్పీ లతాకుమారిని విచారణాధికారిగా నియమించించింది. దీంతో పోలవరం డీఎస్పీ లతాకుమారి, సీఐ మూర్తిలు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ప్రాజెక్టు అధికారి రాసలీలలు, అవినీతి బండారం బట్టబయలైంది. లైంగికంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు నిజమని రుజువయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా శుక్రవారం సూర్యనారాయణను అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్డులో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి సూర్యనారాయణకు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.