పొట్టకూటికెళ్తే.. బతుకే భారమాయే..

by Sridhar Babu |   ( Updated:2021-06-19 03:47:55.0  )
karimnagar
X

దిశ, కరీంనగర్ సిటీ : బతుకుదెరువు కోసం ఉన్న ఊరును, భార్య, పిల్లలను వదిలి పరాయి దేశం వెళ్తే, అక్కడ రోడ్డు పాలయ్యాడు. అధిక వేతనం చెల్లిస్తామంటూ ప్రలోభాలతో తీసుకెళ్లిన కంపెనీ, మూడు నెలలకే చేతులు ఎత్తేసింది. వీసా, పాస్ పోర్టులు లాక్కోని బయటకు గెంటేశారు. దీంతో ఉండేందుకు ఇల్లు లేక, చేసేందుకు పని లభించక పార్కులు, గార్డెన్‌లే అతనికి ఆవాసాలుగా మారాయి. పొట్ట కూటికోసం దుబాయి వీధుల్లో భిక్షాటన చేస్తున్నాడు. ఎవరైనా భారతీయులు దయతలిస్తే, ఆరోజు భోజనం చేసినట్లు, లేకుంటే పస్తులే అన్నట్లుగా కాలం వెల్లదీస్తున్నాడు.

జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌కు చెందిన ఈయన పేరు మాడిశెట్టి శ్రీనివాస్. భార్య జామున, కొడుకు శివ ఉంన్నారు. కఠిక పేదరికం అనుభవిస్తున్న వీరి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు శ్రీనివాస్ దుబాయి వెళ్లాడు. యజమాని గెంటెయ్యడంతో పరాభవ భారంతో ఇండియాకు రాలేక, దుబాయిలో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. పని చూపిస్తానన్న పీటీసీ సప్లయింగ్ కంపెనీ యజమాని తనను మోసం చేశాడని తిరగబటంతో అతన్ని గెంటేశారు. దీంతో పనిలేక ఏడాది నుంచి రోడ్ల వెంట తిరుగుతూ, ఎవరైనా దయతలచి మా వూరికి పంపిస్తే జన్మజన్మలకు మర్చిపోనని వేడుకుంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed