రైతు సోదరులకు నమస్కారం.. నేను మీ కలెక్టర్

దిశ, నిజామాబాద్: కొనుగోలు కేంద్రాలకు ఇబ్బందులు పడకుండా ధాన్యం తెచ్చే విధానాన్ని వివరిస్తూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రైతు సోదరులకు మెసేజ్ పంపారు.‘జిల్లా రైతు సోదరులకు నమస్కారం, నేను మీ జిల్లా కలెక్టర్‌ను మాట్లాడుతున్నానని అంటూ కరోనా వైరస్ గురించి మీ అందరికీ తెలుసు అని లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించి ఈ వ్యాధిని ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని అప్పుడే ఇది ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుందని’తెలిపారు. సీఎం రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని […]

Update: 2020-04-08 07:23 GMT

దిశ, నిజామాబాద్: కొనుగోలు కేంద్రాలకు ఇబ్బందులు పడకుండా ధాన్యం తెచ్చే విధానాన్ని వివరిస్తూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రైతు సోదరులకు మెసేజ్ పంపారు.‘జిల్లా రైతు సోదరులకు నమస్కారం, నేను మీ జిల్లా కలెక్టర్‌ను మాట్లాడుతున్నానని అంటూ కరోనా వైరస్ గురించి మీ అందరికీ తెలుసు అని లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించి ఈ వ్యాధిని ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని అప్పుడే ఇది ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుందని’తెలిపారు. సీఎం రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున గోనెసంచులు, హమాలీ తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. అంతేగాక కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైతులు రావడం ద్వారా కరోనా పొంచి ఉండే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకొని అధికారులు ఇచ్చిన తేదీ నాడే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. అంతవరకు గాలి, దుమారం, వర్షం వస్తే కాపాడుకోవడానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం తేమ 17 శాతం మించకుండా శుభ్రమైన ధాన్యాన్ని కేటాయించిన తేదీలలో కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని, అక్కడ స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించాలని తద్వారా రైతుకు ఎటువంటి సమస్యలు రావన్నారు. దీనితోపాటు కరోనా మహమ్మారి కూడా మనందరికీ చేరదన్నారు. తద్వారా రైతు కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నారు. ఈ మెసేజ్ చెయిన్ సిస్టంలో రైతు సోదరులందరికీ చేరేలా షేర్ చేయాలని కోరారు.

Tags: message, nizamabad Collector, farmers, coronavirus, Grain buying center

Tags:    

Similar News