బ్రాయిలర్ చికెన్‌తో కరోనా?
కరోనా వైరస్ వ్యాప్తిచెందడం, దాని వల్ల ఇబ్బంది పడటం ఏమో గానీ, ఆ వైరస్ గురించి వస్తున్న తప్పుడు వార్తలతో మాత్రం అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఇది తింటే కరోనా వస్తది, అది తింటే తప్పకుండా తగ్గుతది అంటూ పోస్టులు.. వాటిలో నిజమేదో అబద్ధమేదో తెలియక జనాల ఇబ్బందులు. ఆ పోస్టుల్లో భాగంగా కొత్తగా బ్రాయిలర్ చికెన్ తింటే కరోనా వైరస్ […]
కరోనా వైరస్ వ్యాప్తిచెందడం, దాని వల్ల ఇబ్బంది పడటం ఏమో గానీ, ఆ వైరస్ గురించి వస్తున్న తప్పుడు వార్తలతో మాత్రం అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఇది తింటే కరోనా వస్తది, అది తింటే తప్పకుండా తగ్గుతది అంటూ పోస్టులు.. వాటిలో నిజమేదో అబద్ధమేదో తెలియక జనాల ఇబ్బందులు.
ఆ పోస్టుల్లో భాగంగా కొత్తగా బ్రాయిలర్ చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనేది బాగా పాపులర్ అయింది. దీంతో చికెన్ షాపుల వారు, చికెన్ ప్రియులు ఆందోళన పడుతున్నారు. అయితే ఈ వార్తను ప్రచారం చేస్తూ షేర్ చేస్తున్న ఫొటోల్లో కోళ్లకు వచ్చింది కరోనా కాదని, రనిఖేత్ అనే వేరే వైరస్ అని, దాని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ (రిటైర్డ్) వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.