బ్రాండ్ విలువలో మరోసారి సత్తా చాటిన విరాట్

        వరుసగా మూడో సారి విరాట్ కోహ్లీ తన బ్రాండ్ విలువలో సత్తా చాటుకున్నాడు. డఫ్ అండ్ ఫెల్ప్స్ వారు విడుదల చేసిన సెలెబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ 2019 నివేదికలో మొదటి స్థానంలో నిలిచాడు. 2019లో ఆయన బ్రాండ్ విలువ 39 శాతం పెరిగి 237.5 మిలియన్ డాలర్లుగా ఉంది.         టాప్ 20 జాబితాలో విరాట్‌తో కలిపి నలుగురు క్రికెటర్లు ఉన్నారు. 9వ స్థానంలో ధోని […]

Update: 2020-02-05 20:15 GMT

రుసగా మూడో సారి విరాట్ కోహ్లీ తన బ్రాండ్ విలువలో సత్తా చాటుకున్నాడు. డఫ్ అండ్ ఫెల్ప్స్ వారు విడుదల చేసిన సెలెబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ 2019 నివేదికలో మొదటి స్థానంలో నిలిచాడు. 2019లో ఆయన బ్రాండ్ విలువ 39 శాతం పెరిగి 237.5 మిలియన్ డాలర్లుగా ఉంది.

టాప్ 20 జాబితాలో విరాట్‌తో కలిపి నలుగురు క్రికెటర్లు ఉన్నారు. 9వ స్థానంలో ధోని (41.2 మిలియన్ డాలర్లు), 15వ స్థానంలో సచిన్ (25.1 మిలియన్ డాలర్లు), 20వ స్థానంలో రోహిత్ శర్మ (23 మిలియన్ డాలర్లు) ఉన్నారు. ఈ నలుగురు మినహా మిగతా వాళ్లందరూ సినిమా తారలే.

రెండో స్థానంలో 104.5 మిలియన్ డాలర్లతో అక్షయ్ కుమార్ ఉన్నారు. గతేడాది ఈ స్థానంలో ఉన్న దీపికా పడుకొనే, ఈ ఏడాది 93.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోయారు. ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ కూడా 93.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలోనే ఉండటం విశేషం. విరాట్ కొహ్లీ సతీమణి అనుష్క శర్మ 23.9 మిలియన్ డాలర్లతో 18వ స్థానంలో ఉన్నారు. ఇంకా ఈ జాబితాలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, హృతిక్ రోషన్, వరుణ్ ధామన్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, ఆమిర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ ఖాన్‌‌‌లు ఉన్నారు.

Tags:    

Similar News