అటా..ఇటా…మార్కెట్ సూచీల ఊగిసలాట!

        బడ్జెట్ సానుకూల ఫలితాలను ఇవ్వడంలో విఫలమవడంతో స్టాక్‌మార్కెట్ సోమవారం సైతం నష్టాలతోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్‌ల సంకేతాలు ప్రతికూలంగా ఉండటం, కరోనా వైరస్ భయం గ్లోబల్ మార్కెట్‌పై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్ నెమ్మదిగా పుంజుకుని లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 183 పాయింట్లు లాభపడి 39,919 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. శనివారం బడ్జెట్ సందర్భంగా ప్రత్యేకంగా […]

Update: 2020-02-03 00:01 GMT

డ్జెట్ సానుకూల ఫలితాలను ఇవ్వడంలో విఫలమవడంతో స్టాక్‌మార్కెట్ సోమవారం సైతం నష్టాలతోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్‌ల సంకేతాలు ప్రతికూలంగా ఉండటం, కరోనా వైరస్ భయం గ్లోబల్ మార్కెట్‌పై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్ నెమ్మదిగా పుంజుకుని లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 183 పాయింట్లు లాభపడి 39,919 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. శనివారం బడ్జెట్ సందర్భంగా ప్రత్యేకంగా కొనసాగిన మార్కెట్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. షార్ట్ కవరింగ్ కారణంగా ఇప్పుడిప్పుడే సూచీలన్నీ పుంజుకుంటాయని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే సూచీలన్నీ మెల్లగా లాభాల బాట పట్టాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐటీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బడ్జెట్ తర్వాత నుంచి భారీ నష్టాల్లోకి మారిన ఆటో, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలు ఇంకా నెగెటివ్‌లోనే కొనసాగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాతి పరిణామాలు మూడవ త్రైమాసికంలో ఆటో మొబైల్ కంపెనీలు నెమ్మదిగా కోలుకుంటున్నట్టు కనిపించాయి. అయితే, శనివారం బడ్జెట్ నిరాశజనకంగా ఉండటంతో మళ్లీ దిగజారుతున్నాయి. బడ్జెట్‌కు ముందు లాభాల్లో నడిచిన ఐటీసీ, సిగరెట్ రేట్లు పెరగనున్నాయనే వార్తలతో 52 వారాల దిగువకు పడిపోయి భారీగా నష్టపోయింది. రూపాయి సైతం దేశీయ, అంతర్జాతీయ పరిణామాల కారణంగా బలహీనపడి ప్రస్తుతం 71.63 వద్ద ట్రేడవుతోంది.

Tags:    

Similar News