ఇసుక అక్రమ రవాణా.. ఫోటోలు తీసిన విలేకరిపై ZPTC భర్త దాడి

దిశ, డోర్నకల్ : TRS డోర్నకల్ జడ్పీటీసీ భర్త ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయటమే కాకుండా జరిగే తంతుని ప్రజలు, అధికారులకు వివరించేందుకు ప్రయత్నించిన జర్నలిస్ట్‌పై దాడి చేసిన ఘటన డోర్నకల్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత విలేకరి తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ నియోజకవర్గం ఓ ప్రముఖ వార్తా సంస్థకు జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న నగేష్ విధి నిర్వహణలో భాగంగా ద్విచక్రవాహనంపై సంకీస నుండి ముల్కలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బొడ్రాయి […]

Update: 2021-10-07 10:33 GMT

దిశ, డోర్నకల్ : TRS డోర్నకల్ జడ్పీటీసీ భర్త ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయటమే కాకుండా జరిగే తంతుని ప్రజలు, అధికారులకు వివరించేందుకు ప్రయత్నించిన జర్నలిస్ట్‌పై దాడి చేసిన ఘటన డోర్నకల్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత విలేకరి తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ నియోజకవర్గం ఓ ప్రముఖ వార్తా సంస్థకు జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న నగేష్ విధి నిర్వహణలో భాగంగా ద్విచక్రవాహనంపై సంకీస నుండి ముల్కలపల్లి వైపు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో బొడ్రాయి తండా ప్రాంతానికి చేరుకోగానే సంకీస వైపు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు రావడాన్ని గమనించాడు. దీనిపై సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి దృశ్యాలను చిత్రీకరిస్తుండగా.. డ్రైవర్లు ట్రాక్టర్లలను ఆపి.. ఈ ట్రాక్టర్లు జడ్పీటీసీ భర్తవి అని తెలిపారు. అయితే, ఇసుక ట్రాక్టర్లు ఎవరివి అయినా వీటిపై పోలీసులకు సమాచారం ఇచ్చామని.. వారే చర్యలు తీసుకుంటారని విలేకరి వారికి తెలిపారు.

ఇంతలో అక్కడికి చేరుకున్న ఇసుక ట్రాక్టర్ల యజమాని రామనాథం ఫోటోలు, వీడియోలు తీయటానికి నీవు ఎవరు.. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ ఘర్షణకు దిగాడు. మాటామాటా పెంచుకుంటూ ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు నగేష్ వాపోయాడు. ట్రాక్టర్ డ్రైవర్లు ఎస్టీ సామాజిక వర్గానికి చెందటంతో వారితో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిస్తామని బెదిరింపులకు గురి చేశాడని నగష్ తెలుపుతున్నాడు. జరిగిన విషయాన్ని ఛానల్ ప్రతినిధులకు, యూనియన్ సభ్యుల దృషికి తీసుకెళ్లామని వారి సూచన మేరకు దాడి ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

సీఐ వివరణ..

పెరుమాండ్ల సంకీస గ్రామంలో ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్స్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు. వాటిలో ఇసుకను అక్రమంగా తరలించిన విషయంలో తహసీల్దార్‌కు లెటర్ ద్వారా విషయం తెలియజేశాము. ఈ ఇసుక ట్రాక్టర్స్‌ను ఆపిన విషయంలో, చిలకొడు నగేష్, జడ్పీటీసీ భర్త రామనాథం మధ్య గొడవ జరగడంతో వారి ఇరువురిపైనా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

 

Tags:    

Similar News