సరికొత్తగా జూమ్ యాప్

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ వీడియో కాల్స్ కోసం అత్యధిక మంది ఉపయోగించిన యాప్ గా ‘జూమ్’ లాక్డౌన్ లో రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ టైమ్ లో( మార్చి, ఏప్రిల్ నెలల్లో) అత్యధికంగా డౌన్ లోడ్ లు పొందిన యాప్ గా ‘జూమ్ ’ రెండో స్థానంలో నిలిచింది. లాక్డౌన్ కు ముందు జూమ్ యాప్ కు 1,25,000 యూజర్లు మాత్రమే ఉన్నారు. ఈ యాప్ కేవలం రెండు వారాల్లోనే (మార్చి 11 […]

Update: 2020-05-28 06:45 GMT

దిశ, వెబ్ డెస్క్ :
గ్రూప్ వీడియో కాల్స్ కోసం అత్యధిక మంది ఉపయోగించిన యాప్ గా ‘జూమ్’ లాక్డౌన్ లో రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ టైమ్ లో( మార్చి, ఏప్రిల్ నెలల్లో) అత్యధికంగా డౌన్ లోడ్ లు పొందిన యాప్ గా ‘జూమ్ ’ రెండో స్థానంలో నిలిచింది. లాక్డౌన్ కు ముందు జూమ్ యాప్ కు 1,25,000 యూజర్లు మాత్రమే ఉన్నారు. ఈ యాప్ కేవలం రెండు వారాల్లోనే (మార్చి 11 నుంచి 25 వరకు) 3.6 మిలియన్ల యూజర్లు దక్కించుకుంది. ఆ తర్వాత మరో రెండు వారాల్లో 14 మిలియన్ల యూజర్లు జూమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. కొన్ని ప్రైవసీ కారణాల వల్ల జూమ్ యాప్ ను వాడొద్దంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో .. యాప్ ను ఎవరూ డౌన్ లోడ్ చేయడం లేదు. అయితే జూమ్ యాప్ లోని లోపాలు సరిదిద్దుకుని ప్రస్తుతం సరికొత్త వర్షన్ లో జూమ్ యాప్ రాబోతుంది.

జూమ్‌ యాప్‌ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా ఉందని హర్ష్‌ చుగ్‌ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తగిన చట్టాలు రూపొందించేవరకు జూమ్‌ వీడియో కాలింగ్‌ యాప్‌పై నిషేధం కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ యాప్‌ సురక్షితం కాదని.. ఇందులో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ లేదని ఆయన తెలిపారు. దీని ద్వారా హ్యాకింగ్ కూడా పాల్పడుతున్నారని తెలిపారు. మరోవైపు.. జూమ్‌ యాప్‌ అంత సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూమ్ కంపెనీ ఆ యాప్ లోని బగ్స్ ను తొలగించింది. ఈ క్రమంలో జూమ్‌ కంపెనీ మే 30, 2020లో ఇన్‌స్టాల్‌ అయ్యే నూతన వర్షన్‌నే ఉపయోగించాలని కోరింది. ప్రస్తుతం కంపెనీ జూమ్‌ రూమ్స్‌, సిస్టమ్స్‌, వైర్‌లెస్‌ సేవలను యూజర్లకు అందిస్తోంది. జూమ్ రూమ్స్ యూజర్లకు సరికొత్త అనుభూతినిస్తుందని కంపెనీ తెల్పింది. కొత్త వర్షన్ కోసం అడ్మిన్‌ పోర్టల్‌కు లాగిన్‌ అయ్యి జూమ్‌ రూమ్స్‌ కంట్రోలర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కంపెనీ సూచించింది. జూమ్ 5.0 వర్షన్ లో మీటింగ్ పెట్టుకోవాలంటే.. తప్పనిసరిగా మే 30 లోపు అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ అధికారులు సూచిస్తున్నారు. జూమ్ మీటింగ్స్ , వెబినార్స్, అంతేకాకుండా రాబోయే వారంలో షెడ్యూల్డ్ చేసుకున్న కార్యక్రమాలకు కూడా ఆయా మీటింగ్స్ లో పాల్గొనాలంటే ఇకపై పాస్ వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రైవసీ, సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్ ను అప్డేట్ వర్షన్ లో సాల్వ్ చేశామని కంపెనీ చెబుతోంది. స్క్రీన్ షేరింగ్ విషయంలోనూ కొత్త రూల్స్ వచ్చాయి. వెయిటింట్ రూమ్స్, మీటింగ్ చాట్, పార్టిసిపెంట్ రీనేమింగ్, స్క్రీన్ షేరింగ్ లలో ఎనేబుల్/ డిసేబుల్ ఆప్షన్ తీసుకొచ్చింది. రిమూవ్ పార్టిసిపెంట్, రిపోర్ట్ పార్టిసిపెంట్ కూడా అందుబాటులోకి తెచ్చింది.

Tags:    

Similar News