యువీ బయోపిక్‌కు గల్లీబాయే కరెక్ట్!
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రీడాకారుల జీవితకథలకు ఆదరణ ఎక్కువగానే ఉంది. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘ఎం.ఎస్.ధోని’, ‘మేరీకోమ్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. కపిల్ దేవ్ బయోపిక్‌ను ’83’ పేరుతో తెరెక్కించగా .. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ జీవితకథను తాప్సీ తెరపై ప్రెజెంట్ చేయబోతోంది. మాజీ ఇండియన్ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు […]
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రీడాకారుల జీవితకథలకు ఆదరణ ఎక్కువగానే ఉంది. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘ఎం.ఎస్.ధోని’, ‘మేరీకోమ్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. కపిల్ దేవ్ బయోపిక్‌ను ’83’ పేరుతో తెరెక్కించగా .. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ జీవితకథను తాప్సీ తెరపై ప్రెజెంట్ చేయబోతోంది. మాజీ ఇండియన్ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి బయోపిక్‌లో హృతిక్ రోషన్ నటిస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్న క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే.. ఎవరు నటిస్తే బాగుంటుందన్న ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నే యువీని అడిగితే.. తన పాత్రలో తానే నటించాలని ఉందని చెప్పాడు. కానీ నేను కాకుండా మరొకరు నటిస్తే మాత్రం ‘గల్లీ బాయ్’ ఫేం సిద్ధాంత్ చతుర్వేది నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తన పాత్రకు సిద్ధాంత్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాడని తెలిపాడు. ‘గల్లీ బాయ్’తో ఫేమ్ అయిన సిద్ధాంత్ చతుర్వేది.. అమెజాన్ వెబ్ సిరీస్ ‘ఇన్ సైడ్ ఎడ్జ్’లో క్రికెటర్‌గా కనిపించాడు.
tags : Yuvraj Singh, Biopic, Siddhant Chaturvedi, Bollywood