YouWeCan.. నా ఒక్కడితో కాదు.. మీరు సాయం చేయండి: యువరాజ్ సింగ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిపై పోరుకు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. మిలాప్ ఫౌండేషన్ ద్వారా YouWeCan మిషన్ పేరుతో 1000 బెడ్లు సమకూర్చేందుకు పిలుపునిచ్చాడు. ‘దేశంలో కొవిడ్ కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వార్తాల్లో చూస్తున్నాము.. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌లో దీని ప్రభావం భయానకంగా ఉంది. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు వారికి బెడ్‌లు, ఆక్సిజన్ దొరకని పరిస్థితి […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిపై పోరుకు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. మిలాప్ ఫౌండేషన్ ద్వారా YouWeCan మిషన్ పేరుతో 1000 బెడ్లు సమకూర్చేందుకు పిలుపునిచ్చాడు. ‘దేశంలో కొవిడ్ కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వార్తాల్లో చూస్తున్నాము.. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌లో దీని ప్రభావం భయానకంగా ఉంది. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు వారికి బెడ్‌లు, ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఉంది. ఈ బాధలన్నీ నేను చూడలేకపోతున్నారు. అందుకే YouWeCan పేరుతో మనతో సాధ్యమైనంత వరకు సాయం చేద్దాం.. ఇది నా ఒక్కడి వల్ల కాదు.. నాకు మీ సహాయం కావాలి’ అంటూ యువరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. రాబోయే 30-45 రోజుల్లో కొవిడ్ పేషెంట్ల కోసం ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, అదనంగా 1000 ఆక్సిజన్ బెడ్‌లను అందించేందుకు YouWeCanతో పనిచేద్దాం.. ఇందుకోసం నా స్నేహితులు, అభిమానులు, కార్పొరేట్ కంపెనీలు ఈ పోరాటంలో సహాయం చేయమని కోరుతున్నాను.. ఈ మహమ్మారిని ఓడించాలంటే అందరూ ఏకతాటిపైకి రావాలి’ అంటూ యువీ హితవు పలికారు.