ఆసీస్‌లో క్లబ్ క్రికెట్ ఆడనున్న యువరాజ్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ త్వరలో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. ఆస్ట్రేలియాలోని ‘మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్’ తరపున ఆడటానికి యువరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. యువరాజ్‌తో పాటు వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ క్రిస్ గేల్‌ను కూడా తమ క్లబ్ తరపున ఆడించడానికి మల్‌గ్రేవ్ క్లబ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్ జరిగే నవంబర్-ఫిబ్రవరి సీజన్‌లో వీరిద్దరినీ ఆడించడానికి సదరు క్లబ్ ప్రయత్నాలు ప్రారంభించింది. యువరాజ్ ఇప్పటికే టీమ్ […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ త్వరలో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. ఆస్ట్రేలియాలోని ‘మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్’ తరపున ఆడటానికి యువరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. యువరాజ్‌తో పాటు వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ క్రిస్ గేల్‌ను కూడా తమ క్లబ్ తరపున ఆడించడానికి మల్‌గ్రేవ్ క్లబ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్ జరిగే నవంబర్-ఫిబ్రవరి సీజన్‌లో వీరిద్దరినీ ఆడించడానికి సదరు క్లబ్ ప్రయత్నాలు ప్రారంభించింది. యువరాజ్ ఇప్పటికే టీమ్ ఇండియాకు రిటైర్మెంట్ ప్రకటించి బయటి లీగ్స్ ఆడుతున్నాడు. బీసీసీఐ పరిధిలో కూడా యువరాజ్ లేడు. ఇక క్రిస్ గేల్ ఆడటానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. ఇప్పటికే ఆ క్లబ్ శ్రీలంక ఆటగాళ్లు తిలకరత్నె దిల్షాన్, ఉపుల్ తరంగలను చేర్చుకున్నది. ఆ క్లబ్‌కు జయసూర్య హెడ్ కోచ్‌గా నియమించ బడ్డాడు. దీంతో వీరిద్దరు కూడా జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.