గ్రానైట్ వ్యవహారం.. హాట్ టాపిక్‌గా మారిన గంగుల, బండి సంజయ్
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ గ్రానైట్ ఏజెన్సీలలో చోటు చేసుకున్న అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్త చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ పై వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రానైట్ అక్రమాలకు గంగుల వత్తాసు పలకడానికి కారణాలేంటని ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కూడా ప్రారంభం కాని గ్రానైట్ వ్యవహారంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ గ్రానైట్ ఏజెన్సీలలో చోటు చేసుకున్న అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్త చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ పై వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రానైట్ అక్రమాలకు గంగుల వత్తాసు పలకడానికి కారణాలేంటని ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కూడా ప్రారంభం కాని గ్రానైట్ వ్యవహారంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
ఒక వేళ గ్రానైట్ అక్రమాలపై క్లీన్ చిట్ ఇస్తే.. ఆ లేఖలను బహిరంగపర్చాలని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి కూడా ఆయన సవాల్ విసిరారు. కరీంనగర్ గ్రానైట్ ఏజెన్సీలలో జరిగిన అక్రమాలపై బండి సంజయ్ ఏ చట్టబద్దమైన సంస్థకు ఫిర్యాదు చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అన్న వివరాలను మీడియాకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ యాక్ట్ ప్రకారం దారిమళ్లిన సీనరేజ్ ఫండ్ కు ఐదు రెట్ల ఫైన్ విధించాలని విజిలెన్స్ అధికారులు ప్రతిపాదించారన్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైన్ ను వన్ ప్లస్ వన్ కు కుదిస్తూ మెమో విడుదల చేసిందని, చట్టపరంగా ఈ నిర్ణయం తప్పేనన్నారు. అయినప్పటికీ గ్రానైట్ ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రకారం రూ. 250 కోట్లకు బదులు రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించాయని వైఎస్సార్సీపీ నాయకుడు ఆరోపించారు. 2013 నుండే అక్రమంగా తరలిపోయిన గ్రానైట్ బ్లాకుల తాలూకు సీనరేజ్ ఫండ్ ను ప్రభుత్వానికి చెల్లించాలని పోరాటం చేస్తున్నానన్నారు. గ్రానైట్ ఏజెన్సీల నుండి ప్రతి రూపాయి ప్రభుత్వానికి చెల్లించే వరకూ న్యాయ పోరాటం నిలిపేది లేదని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.