రెబెల్స్ పై వైసీపీ ఆగ్రహం.. వారిపై సస్పెన్షన్ వేటు
దిశ, వెబ్ డెస్క్: రెబెల్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ గా పోటీ చేసిన వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా నుంచే ఈ వేటుల పర్వం మెుదలు పెట్టింది. కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పాటించని వారిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని 14, 40, 44 వ డివిజన్ లలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు పోటీగా […]
దిశ, వెబ్ డెస్క్: రెబెల్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ గా పోటీ చేసిన వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా నుంచే ఈ వేటుల పర్వం మెుదలు పెట్టింది. కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పాటించని వారిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని 14, 40, 44 వ డివిజన్ లలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు పోటీగా నామినేషన్ వేసిన రెబల్స్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సస్పెండ్ అయిన వారిలో బూస్ట్ విజయ్ కుమార్, జి. సుధాకర్, ఎం.డి.అల్ ఫోన్స్, శివశంకర్(చిట్టిబాబు), వారధి జోసెఫ్, ఉప్పలపాటి భాస్కర్, ఓబుల్ రెడ్డి, కె.చంద్రఓబుల్ రెడ్డి, ఇల్లూరి జయరాజు, వెల్లాల రామకృష్ణ రెడ్డిలు ఉన్నారు. వీరందరి పార్టీ పదవులు, సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వాడుకున్నా.. నాయకుల పేర్లు ఉపయోగించిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నగర వైసీపీ అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ తెలిపారు.