షర్మిలకు అంత సీన్ ఉందా.. ఎందుకంత భయం?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాట్లు శరవేంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను ఏకం చేసిన షర్మిల లోటస్‌ పాండ్‌ వేదికగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ విధివిధానాల అంశాలపై నేతలతో చర్చలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెండ్డి, విహెచ్, భట్టి […]

Update: 2021-02-16 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాట్లు శరవేంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను ఏకం చేసిన షర్మిల లోటస్‌ పాండ్‌ వేదికగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ విధివిధానాల అంశాలపై నేతలతో చర్చలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెండ్డి, విహెచ్, భట్టి విక్రమార్క వంటి పలువురు కీలక నేతలు షర్మిల పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతేగాకుండా రేవంత్ రెడ్డి పలుమార్లు షర్మిల కేసీఆర్ వదిలిన బాణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందని, అంతమాత్రాన షర్మిల పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. జగన్‌తో గొడవలు ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి, కాని తెలంగాణలో కాదు అంటూ షర్మిలపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.

తాజాగా.. షర్మిల పార్టీపై టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ స్పందిస్తూ.. ఆంధ్రా పార్టీలకు తెలంగాణ స్థానం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న వదిలిన బాణం తెలంగాణకు వస్తోందని ఎద్దేవా చేశారు. ముందు షర్మిల, తర్వాత జగన్, ఆ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణకు వస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ఆగ్రహం వెల్లడించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రా పాలకుల పెత్తనం వస్తే.. కష్టాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరే మన రక్షకుడు అని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని సూచించారు. వైఎస్‌ షర్మిల పార్టీతో తెలంగాణలో కొట్లాటలు తప్పవని, మళ్లీ సమైక్య రాష్ట్రం అవుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే.. షర్మిల పొలిటికల్ ఎంట్రీపై తెలంగాణ కీలక పార్టీలు ఎందుకు జంకుతున్నాయనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. తెలంగాణలో షర్మిల పార్టీకి అత సీన్ ఉందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా ఎందుకంత హీట్ పెంచేసిందనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. షర్మిల వెనుక అన్న జగన్‌‌తో ఉన్న విభేదాలే కారణమా?, ఒకవేళ అదే నిజమైతే ఏపీలో పార్టీ పెట్టాలి గానీ తెలంగాణలో పార్టీ ఏర్పాటు ఎందుకని ప్రశ్న రేకెత్తుతోంది. వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఇదంతా బీజేపీ బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తోందని, తెలంగాణలో పార్టీ పెట్టించి, ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని చూస్తోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల కేసీఆర్ వదిలిన బాణం అని, తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ అభిమానులను కూడగట్టి టీఆర్ఎస్‌లో కలపాలని చూస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా షర్మిల పార్టీని రాష్ట్రంలోని కీలక పార్టీలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏముందని, ఆమెకు ఇక్కడ అంత సీన్‌ ఉందా అనే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఆమె వల్ల ఏ పార్టీకి నష్టమో ఆలోచన చేయాలని.. లేకుంటే నష్టం జరగొచ్చని, షర్మిల పార్టీ కచ్చితంగా భవిష్యత్తులో కొంత ప్రభావం చూపుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News