చిన్నారి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది.. వైఎస్ షర్మిల ట్వీట్
దిశ, తెలంగాణ బ్యూరో: సైదాబాద్‌లో చిన్నారి చైత్ర మృతి తనను తీవ్ర దిగ్భ్రంతికి గురిచేసిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల బుధవారం ట్వీట్ చేశారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనమని ఆమె మండిపడ్డారు. కుటుంబసభ్యులు, మహిళలపై లాఠీచార్జ్ చేసి చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లారని విమర్శించారు. ఉద్యోగాలు పోతాయనే భయంతో కేసీఆర్, మంత్రులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. 30 వేల జనాభా ఉన్న కాలనీలో ప్రజలకు రక్షణ […]
దిశ, తెలంగాణ బ్యూరో: సైదాబాద్‌లో చిన్నారి చైత్ర మృతి తనను తీవ్ర దిగ్భ్రంతికి గురిచేసిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల బుధవారం ట్వీట్ చేశారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనమని ఆమె మండిపడ్డారు. కుటుంబసభ్యులు, మహిళలపై లాఠీచార్జ్ చేసి చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లారని విమర్శించారు. ఉద్యోగాలు పోతాయనే భయంతో కేసీఆర్, మంత్రులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. 30 వేల జనాభా ఉన్న కాలనీలో ప్రజలకు రక్షణ కరువైందన్నారు. పందులు చిన్నారులను పీక్కు తింటున్నా పట్టించుకునేవారు లేరని, కాలనీలో మద్యం ఏరులై పారుతున్నా.. అబ్కారీ అధికారులు స్పందించడం లేదని ఆమె ట్వీట్ చేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే చిన్నారులపై నేడు దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.