KCR దొర.. డాక్టర్లుంటే బెడ్స్ లేవు.. బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదు : షర్మిల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్‌వేవ్‌లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోయారు. ఆ సమయంలో పారాసిటమల్ గోలి వేసుకంటే సరిపోతుందని సీఎం కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని వైఎస్సార్‌తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల ఫైరయ్యారు. ఇప్పుడు ఒమిక్రాన్విస్తరిస్తోందని.. కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి దొర అంటూ సోమవారం ట్విట్టర్వేదికగా సెటైర్లు వేశారు. ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్‌వేవ్‌లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోయారు. ఆ సమయంలో పారాసిటమల్ గోలి వేసుకంటే సరిపోతుందని సీఎం కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని వైఎస్సార్‌తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల ఫైరయ్యారు. ఇప్పుడు ఒమిక్రాన్విస్తరిస్తోందని.. కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి దొర అంటూ సోమవారం ట్విట్టర్వేదికగా సెటైర్లు వేశారు.
ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాలని షర్మిల డిమాండ్‌చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టి ప్రతీ ఒక్కరికీ కొవిడ్రెండు డోసుల వ్యాక్సిన్ అందేలా చేయాలన్నారు. గతంలో కరోనాతో ఇల్లు గుల్ల అయిన కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడండి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చెయ్యండి. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయినా కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించండి. 2/2
— YS Sharmila (@realyssharmila) November 29, 2021