కేసీఆర్‌కు చేతకాలేదు.. షర్మిల సంచలన కామెంట్
దిశ, తెలంగాణ బ్యూరో: దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి ఇవ్వడం సీఎం కేసీఆర్ కు చేతకాలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నామని, ఇక అవమానించినా నోరు మూసుకొని పడుంటారనే సీఎం వారి ఇండ్లను లాక్కుంటున్నారని’’ ఆమె మండిపడ్డారు. మూడెకరాలు ఇవ్వలేని ప్రభుత్వం ముత్తాతల నాటి భూములు మాత్రం లాక్కుంటున్నారని విమర్శలు చేశారు. పార్కులు, పరిశ్రమలకంటూ పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమిని […]
దిశ, తెలంగాణ బ్యూరో: దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి ఇవ్వడం సీఎం కేసీఆర్ కు చేతకాలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నామని, ఇక అవమానించినా నోరు మూసుకొని పడుంటారనే సీఎం వారి ఇండ్లను లాక్కుంటున్నారని’’ ఆమె మండిపడ్డారు. మూడెకరాలు ఇవ్వలేని ప్రభుత్వం ముత్తాతల నాటి భూములు మాత్రం లాక్కుంటున్నారని విమర్శలు చేశారు. పార్కులు, పరిశ్రమలకంటూ పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమిని లాక్కొని భూమి మీద ఆధారపడి బతుకుతున్న పేద ప్రజలను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దళితులపై ప్రేమ చూపుతూనే.. మరోవైపు దళితుల భూములను లాక్కొనే పథకాన్ని కేసీఆర్ మొదలెట్టారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ దొర ఇక మారరా అని ఆమె ట్వీట్ చేశారు.
దొరా.. నువు మారవా?
దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నాం ..
అవమానించినా,
ఆశ పెట్టినా,
ఎం చేసినా
దళితులు నోరు మూసుకొని పడుంటారు అనే కదా KCR భూములు ఇండ్లు లాక్కొనేది?
మూడు ఎకరాల భూమి ఇవ్వ శాతకాలేదు కానీ ..
ముత్తాతాతల తండ్రులనుంచి దున్నుకుంటున్న భూములను మాత్రం లాక్కొంటున్నాడు 1/2 pic.twitter.com/1iEpxWTAoQ— YS Sharmila (@realyssharmila) August 14, 2021