సెప్టెంబర్ నుంచి మంచి బియ్యం డోర్ డెలివరీ చేస్తాం: జగన్

దిశ ఏపీ బ్యూరో: సెప్టెంబర్ నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ నాణ్యమైన రేషన్ బియ్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పౌరసరఫరాల శాకాధికారులుతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సెప్టెంబరు 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ వాహనాల ద్వారా లబ్దిదారుల ఇంటివద్దకే రేషన్ సరకులు డోర్ డెలివరీ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. బియ్యం నాణ్యత, పంపిణీలో పారదర్శకతే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి […]

Update: 2020-05-09 03:10 GMT

దిశ ఏపీ బ్యూరో: సెప్టెంబర్ నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ నాణ్యమైన రేషన్ బియ్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పౌరసరఫరాల శాకాధికారులుతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సెప్టెంబరు 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

మొబైల్ వాహనాల ద్వారా లబ్దిదారుల ఇంటివద్దకే రేషన్ సరకులు డోర్ డెలివరీ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. బియ్యం నాణ్యత, పంపిణీలో పారదర్శకతే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా సెప్టెంబరు 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని అమలు చేయాలని ఆయన పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిపారు.

గ్రామసచివాలయాల్లో 13,370 మొబైల్ యూనిట్లు ఉన్నాయని అధికారులు జగన్‌కు తెలిపారు. మొబైల్ యూనిట్‌లోనే ఎలక్ట్రానిక్ కాటా కూడా ఉంటుందని చెప్పారు. లబ్ధిదారుల ముందే బస్తా సీల్ తీసి కోటా బియ్యం అందిస్తామని అధికారులు అన్నారు. బియ్యం కోసం నాణ్యమైన సంచులు కూడా అందజేస్తామని చెప్పారు. రేషన్ ద్వారా ప్రతి నెల 2.3 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం పంపిణీ అవుతుందని అన్నారు.

Tags:    

Similar News