లాక్‌డౌన్‌పై రేపు క్లారిటీ?

లాక్‌డౌన్ గడువు ముంచుకొస్తోంది. 21 రోజుల లాక్‌డౌన్ పాక్షిక సత్ఫలితాలనిచ్చింది. లాక్‌డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని, కరోనాను కట్టడి చేయవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడ్డాయి. భారతదేశ చర్యను ప్రపంచ దేశాలు కూడా కొనియాడాయి. ఈ క్రమంలో ప్రధానితో పాటు ప్రజలపై కూడా ప్రశంసలు కురిశాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలోని ప్రజల దేశభక్తిని వేనోళ్ల పొగిడారు. అయితే ఇవేవీ కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. గత నెల రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు కరోనాపై ఆకస్మిక యుద్ధాన్ని […]

Update: 2020-04-12 06:55 GMT

లాక్‌డౌన్ గడువు ముంచుకొస్తోంది. 21 రోజుల లాక్‌డౌన్ పాక్షిక సత్ఫలితాలనిచ్చింది. లాక్‌డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని, కరోనాను కట్టడి చేయవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడ్డాయి. భారతదేశ చర్యను ప్రపంచ దేశాలు కూడా కొనియాడాయి. ఈ క్రమంలో ప్రధానితో పాటు ప్రజలపై కూడా ప్రశంసలు కురిశాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలోని ప్రజల దేశభక్తిని వేనోళ్ల పొగిడారు. అయితే ఇవేవీ కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.

గత నెల రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు కరోనాపై ఆకస్మిక యుద్ధాన్ని ప్రకటించినట్టు స్పష్టం చేశాయి. అయితే వారికి దీటుగా కరోనా కూడా పోరాడుతోంది. కరోనా వ్యాప్తి నిరోధానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తన ఉనికిని చాటుకోవడం కరోనా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. దీంతో రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా? ముగిస్తుందా? అన్న ఆసక్తి కర చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో సమీక్షలో లాక్‌డౌన్‌ను ముగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఇది విమర్శలకు తావిచ్చింది.

ఒకవైపు కరోనా కేసులు తీవ్రంగా నమోదువుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా 81 రెడ్, ఆరెంజ్ జోన్లు ఉన్నాయని ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా మారుతాయో ఊహించవచ్చు. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితి లాక్‌డౌన్ కారణంగా నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఉద్యోగులకు జీతాలు కూడా దశల వారీగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. మరోవైపు వలంటీర్ల జీతభత్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారే ప్రమాదం ఉంది.

ఇంకోవైపు రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇన్ని సమస్యల నడుమ ఆర్ధిక ఆవలంబన లేకపోతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు, నిధులు, తాయిలాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, దీనిని తప్పించుకునేందుకు లాక్‌డౌన్‌ను సడలించాలని ఏపీ సీఎం భావిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ, మత్స్య రంగాలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటన్నింటికీ తారకమంత్రంగా లాక్‌డౌన్ ఎత్తివేత కనిపిస్తోంది. అందుకే ఏపీలో లాక్‌డౌన్‌ను పాక్షింకంగా అయినా ఎత్తివేస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. దీనిపై రేపటి పూర్తి క్లారిటీ రానుంది. విపక్షాలు మాత్రం లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరుకుంటుండడం కొసమెరుపు.

tags: andhra pradesh, lockdown, ysrcp, jagan, ap cm

Tags:    

Similar News