సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. తీర్పు వాయిదా
దిశ, ఏపీ బ్యూరో: అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది. సెప్టెంబర్ 15న తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తనకున్న అధికారాలతో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జూలైలోనే వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును ఆగస్టు 25కు కోర్టు వాయిదా […]
దిశ, ఏపీ బ్యూరో: అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది. సెప్టెంబర్ 15న తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తనకున్న అధికారాలతో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జూలైలోనే వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును ఆగస్టు 25కు కోర్టు వాయిదా వేసింది. తాజాగా తీర్పును సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.
ఇకపోతే అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని..అలాగే ఆయనపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను సీఎం జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అలాగే అనేక కారణాలను సాకుగా చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఈ కేసు తీర్పును సెప్టెంబర్ 15కు వాయిదా వేయడంతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. అటు రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.