ట్రెండింగ్.. 24 నిమిషాల్లో 50 ఈస్టర్ ఎగ్స్.. హాంఫట్

దిశ, ఫీచర్స్ : యూట్యూబ్‌లో టాప్ వ్యూస్ తెచ్చుకునే చానెల్స్‌లో చాలా మట్టుకు ఫుడ్‌కు సంబంధించనవే ఉంటాయి. అయితే వీటితో పాటు ఫుడ్ ఎక్కడ బాగుంటుందో చెప్పే ఫుడ్ రేంజర్స్ కూడా ఈ క్రమంలో చాలా మంది పాపులర్ అయ్యారు. ఇక ప్రొఫెషనల్ ఫుడ్ ఈటర్స్‌ పార్టిస్టిపేట్ చేసే ‘ఫుడ్ చాలెంజ్’ వీడియోలైతే క్షణాల్లో ట్రెండింగ్‌లో నిలిచిపోతాయి. మన దగ్గర కూడా ఇటీవలే ‘బుల్లెట్ థాళీ’, అంతకుముందు ‘కింగ్ బిర్యానీ, క్వీన్ బిర్యానీ’ అంటూ పోటీలు జరిగాయి. […]

Update: 2021-04-11 02:35 GMT

దిశ, ఫీచర్స్ : యూట్యూబ్‌లో టాప్ వ్యూస్ తెచ్చుకునే చానెల్స్‌లో చాలా మట్టుకు ఫుడ్‌కు సంబంధించనవే ఉంటాయి. అయితే వీటితో పాటు ఫుడ్ ఎక్కడ బాగుంటుందో చెప్పే ఫుడ్ రేంజర్స్ కూడా ఈ క్రమంలో చాలా మంది పాపులర్ అయ్యారు. ఇక ప్రొఫెషనల్ ఫుడ్ ఈటర్స్‌ పార్టిస్టిపేట్ చేసే ‘ఫుడ్ చాలెంజ్’ వీడియోలైతే క్షణాల్లో ట్రెండింగ్‌లో నిలిచిపోతాయి. మన దగ్గర కూడా ఇటీవలే ‘బుల్లెట్ థాళీ’, అంతకుముందు ‘కింగ్ బిర్యానీ, క్వీన్ బిర్యానీ’ అంటూ పోటీలు జరిగాయి. కాగా లండ‌న్‌కు చెందిన యూట్యూబ‌ర్ మ్యాక్స్ స్టాన్‌ఫ‌ర్డ్ ఓ మంచి భోజనప్రియుడే. కాంపిటీషన్స్‌లో అయితే క్షణాల్లో ప్లేట్లు ఖాళీ చేసే ఈ ఫుడ్ లవర్ తాజాగా మరో ఫీట్ సాధించాడు.

మ్యాక్స్ స్టాన్‌ఫ‌ర్డ్ తరుచుగా ఫుడ్ చాలెంజ్‌ పోటీల్లో పాల్గొంటూ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంటాడు. పండుగను తనదైన రీతిలో జరుపుకోవడానికి ఈస్టర్-స్పెషల్ చాలెంజ్ చేయాలని యూట్యూబర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో స్టాన్‌ఫర్డ్, మరో యూట్యూబర్‌తో కలిసి ‘మ్యాక్స్ వర్సెస్ ఫుడ్’ అనే వీడియో రూపొందించాడు. ఇందులో భాగంగా స్టాన్‌ఫర్డ్ కేవలం 24 నిమిషాల్లో 50 చాక్లెట్ ఎగ్స్ తిని, ఔరా అనిపించాడు. అంటే సగటున ఒక చాక్లెట్ ఎగ్ తినడానికి అతడికి అర నిమిషం కంటే తక్కువ సమయమే పట్టింది. 50 ఈస్టర్ ఎగ్స్ బరువు 2 కిలోలు కాగా, 8,850 కేలరీల ఎనర్జీ ఇస్తాయి అవి. హార్డ్‌నెస్ ఆఫ్ చాక్లెట్, క్రీమ్ ఫిల్లడ్ ఎగ్స్ వల్ల తినడం చాలా కష్టంగా ఉంటుందని స్టాన్ వివరించాడు.

ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, అంత తక్కువ సయమంలో 50 ఎగ్స్ తినడం మామూలు విషయం కాదని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. స్టాన్‌ఫర్డ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఫుడ్ కాంపిటీషన్స్‌కు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న ఈ ఫుడ్ లవర్, రికార్డ్స్ బ్రేక్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే అతడు గతేడాది సెప్టెంబర్‌లో 5 నిమిషాల్లో ఏకంగా 141 చాక్లెట్ బిస్కెట్లను తిని వ‌ర‌ల్డ్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాదు 2020 బ్రిటిష్ ఈటింగ్ లీగ్‌లో రన్నరప్‌గా నిలిచాడు. పది నిమిషాల్లో 30 డోనట్స్, 16 ఇంచెస్ పిజ్జా ఇన్ 5 మినట్స్, అన్‌డిఫిటెడ్ బ్రేక్ ఫాస్ట్ చాలెంజ్, అన్‌డిఫిటెడ్ పాన్ కేక్ చాలెంజ్ వంటి వీడియోలు స్టాన్‌ఫర్డ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

 

Tags:    

Similar News