యూట్యూబ్ రివైండ్ 2020 లేనట్లే!

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో రోజూ ఏదో వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటోంది. అలా ఓ సంవత్సరం బోలెడన్నీ ట్రెండింగ్ వీడియోలుంటాయి. అలా ఏడాదిలో ట్రెండింగ్‌గా నిలిచిన వైరల్ మూమెంట్స్, మేజర్ ట్రెండ్స్‌తోపాటు, మోస్ట్ పాపులర్ కంటెంట్ క్రియేటర్స్‌‌తో కూడిన వీడియోలను యూట్యూబ్ రివైండ్ పేరుతో విడుదల చేస్తోంది. 2010 నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చిన యూట్యూబ్ ఈసారి మాత్రం ఆ ట్రెడిషన్‌కు బ్రేక్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం కొత్త ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతుంటారు. 2020లో […]

Update: 2020-11-13 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో రోజూ ఏదో వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటోంది. అలా ఓ సంవత్సరం బోలెడన్నీ ట్రెండింగ్ వీడియోలుంటాయి. అలా ఏడాదిలో ట్రెండింగ్‌గా నిలిచిన వైరల్ మూమెంట్స్, మేజర్ ట్రెండ్స్‌తోపాటు, మోస్ట్ పాపులర్ కంటెంట్ క్రియేటర్స్‌‌తో కూడిన వీడియోలను యూట్యూబ్ రివైండ్ పేరుతో విడుదల చేస్తోంది. 2010 నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చిన యూట్యూబ్ ఈసారి మాత్రం ఆ ట్రెడిషన్‌కు బ్రేక్ ఇచ్చింది.

ప్రతి సంవత్సరం కొత్త ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతుంటారు. 2020లో కూడా అందరూ అదే ఆశించారు. కానీ, కరోనా అందరి కలల్లో కల్లోలం నింపేసి, భయభ్రాంతులతో బతికేలా చేసింది. ఈ ఏడాది ఎందరికో ఓ చేదు జ్ఞాపకం. అందుకే యూట్యూబ్ కూడా తమ రివైండ్ 2020 వీడియో విడుదల చేయడం లేదని స్వయంగా ప్రకటించింది.

‘‘2010 నుంచి రివైండ్ వీడియోలతో ఏడాదికి ముగింపు పలుకుతూ వచ్చాం. అందులో మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ క్రియేటర్స్, వీడియోస్, ట్రెండ్స్ ఇచ్చాం. కానీ, 2020 భిన్నమైంది. ఇది సరైన సమయం కాదని మేము భావిస్తున్నాం. అందుకు రివైండ్ ట్రెడిషన్‌కు ఈ ఏడాది బ్రేక్ ఇస్తున్నాం. 2020లో కూడా మీరంతా ఎంతో మంచి వీడియోలు అందించారు. మీరంతా ప్రజలకు సాయం అందించారు, నవ్వించారు, వారిని చేయూతనిచ్చారు. ఇలా మీరు కష్టతరమైన సంవత్సరాన్ని మంచిగా ఎండ్ చేశారు’’ అని యూట్యూబ్ తన ప్రకటనలో పేర్కొంది.

 

https://twitter.com/YouTube/status/1326947861305696263/photo/1

Tags:    

Similar News